close
Choose your channels

రిపబ్లిక్ డే సందర్భంగా 'విశ్వరూపం-2'

Wednesday, November 29, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం 2`. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే మ‌ళ్లీ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలయ్యింది. ఒకటి, రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోనుంద‌ని తెలిసింది.

గ్లోబల్ టెర్రరిజం నేప‌థ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన విశ్వరూపం` (2013)కి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతుల్ తివారి, కమల్ హాసన్ కథను అందించారు. ఇక కమల్ సరసన పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండ‌గా రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదారెహ్మాన్ తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరిలో విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. రాజకీయాల్లోకి రాబోతున్న కమల్‌కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment