రిపబ్లిక్ డే సందర్భంగా 'విశ్వరూపం-2'

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం 2'. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే మ‌ళ్లీ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలయ్యింది. ఒకటి, రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోనుంద‌ని తెలిసింది.

గ్లోబల్ టెర్రరిజం నేప‌థ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన విశ్వరూపం' (2013)కి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతుల్ తివారి, కమల్ హాసన్ కథను అందించారు. ఇక కమల్ సరసన పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండ‌గా రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదారెహ్మాన్ తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరిలో విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. రాజకీయాల్లోకి రాబోతున్న కమల్‌కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.

More News

'ఖడ్గం'కి 15 ఏళ్లు

దేశ భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వాటిలో విజయం సాధించే సినిమాల సంఖ్య కూడా అంతే అరుదుగా ఉంటుంది. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందించిన ఖడ్గం ఒకటి.

అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, ఒక్క క్షణం ఫస్ట్ లుక్

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్

'మేరా భార‌త్ మ‌హాన్‌' షూటింగ్ ప్రారంభం!

ప్ర‌థ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టిపిఆర్ తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం `మేరా భార‌త్ మ‌హాన్‌`. అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'బిచ్చ‌గాడు' సినిమా న‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు 'ఇంద్ర‌సేన' త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది - విజ‌య్ ఆంటోని

విజయ్‌ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్‌ మేరీ తారాగణంగా రూపొందిన చిత్రం 'ఇంద్రసేన'. జి.శ్రీనివాసన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్‌ బేనర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.

నిఖిల్ 15 అప్ డేట్స్

మంచి కథల్ని ఎన్నుకుని సినిమాలు చేసే యువ కథానాయకుల్లో నిఖిల్ ముందుంటారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. కన్నడలో సూపర్ హిట్ చిత్రంగా పేరుతెచ్చుకున్న ‘కిరిక్ పార్టీ’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో తన కెరీర్ లో 15 సినిమాలను పూర్తిచేస్తున్నారు నిఖిల్.