close
Choose your channels

ఆగస్ట్‌ 10న కమల్‌హాసన్‌ 'విశ్వరూపం 2'

Friday, July 27, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆగస్ట్‌ 10న కమల్‌హాసన్‌ విశ్వరూపం 2 

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆస్కార్‌ ఫిలింస్‌ వి.రవిచంద్రన్‌ తెలిపారు.

కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌, ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment