కమల్ 232వ చిత్రం`విక్రమ్`..టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఇటీవలే 'ఖైదీ' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం `విక్రమ్`. కమల్ హాసన్ 232వ సినిమాగా రూపొందుతున్నఈ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్7 యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా `విక్రమ్` మూవీ టైటిల్ రివీల్ టీజర్‌ని కమల్ హాసన్ విడుదల చేశారు.
‘వన్స్ అపాన్ ఎ టైం దేర్ లివ్డ్ ఎ ఘోస్ట్’..‘చాల కాలం క్రితం ఒక రాక్షసుడు ఉండేవాడు’ అంటూ మొత్తం గన్ లతో కమల్ ఆకారం వచ్చేలా రూపొందించిన కాన్సెప్ట్ పోస్టర్ ని సింక్ చేస్తూ ఈ టైటిల్ టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్లో కమల్ హాసన్ మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. స్వయంగా భోజనం తయారుచేసి అరటి ఆకుల్లో అతిథులకు వడ్డించడం, శత్రువులపై దాడి చేయడానికి ముందుగానే ఆయుధాల్ని ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో దాచి పెట్టడం లాంటి అంశాలతో సాగే ఈ టీజర్‌లో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments