క‌మ‌ల్ 232వ చిత్రం`విక్ర‌మ్`..టీజ‌ర్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Saturday,November 07 2020]

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ హీరోగా ఇటీవలే 'ఖైదీ' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'విక్ర‌మ్'‌. కమల్ హాసన్ 232వ సినిమాగా రూపొందుతున్నఈ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. న‌వంబ‌ర్7 యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'విక్ర‌మ్' మూవీ టైటిల్ రివీల్ టీజ‌ర్‌ని కమల్‌ హాసన్ విడుద‌ల చేశారు.

‘వన్స్ అపాన్ ఎ టైం దేర్ లివ్డ్ ఎ ఘోస్ట్’..‘చాల కాలం క్రితం ఒక రాక్షసుడు ఉండేవాడు’ అంటూ మొత్తం గన్ లతో కమల్ ఆకారం వచ్చేలా రూపొందించిన‌ కాన్సెప్ట్‌ పోస్టర్ ని సింక్ చేస్తూ ఈ టైటిల్‌ టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజ‌ర్లో కమల్ హాస‌న్ ‌మాస్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. స్వయంగా భోజనం త‌యారుచేసి అరటి ఆకుల్లో అతిథులకు వడ్డించ‌డం, శ‌త్రువుల‌పై దాడి చేయడానికి ముందుగానే ఆయుధాల్ని ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో దాచి పెట్టడం లాంటి అంశాల‌తో సాగే ఈ టీజ‌ర్‌లో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్‌.