కమల్ హాసన్‌కు రేపు ఆపరేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ రేపు ఆస్పత్రిలో చేరబోతున్నారు. ఆపరేషన్ (శస్త్రచికిత్స) కమల్ ఆస్పత్రిలో చేరుతున్నట్లు పార్టీ తరఫున ఓ ప్రకటనను విడుదలైంది. ఈ ప్రకటనలో అసలెందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది..? శస్త్ర చికిత్స ఎందుకు..? అనే విషయాలను సైతం నిశితంగా పార్టీ రాసుకొచ్చింది. ‘2016లో కమల్‌గారు ఓ ప్రమాదానికి గురయ్యారు.
అప్పట్లో కాలుకు చికిత్స చేసిన డాక్టర్లు ఇంప్లాంట్‌ను అమర్చారు. అయితే ఇప్పుడు దాన్ని తీసేసే టైమ్ వచ్చింది. ఆపరేషన్ తర్వాత కమల్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఈ శస్త్రచికిత్స గతంలోనే జరగాల్సి వుంది.. కానీ అయితే పార్టీ కార్యకలాపాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది’ అని పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉంటే కమల్ శస్త్రచికిత్స సక్సెస్ కావాలని సోషల్ మీడియా వేదికగా కమల్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com