రజనీ, నేను కలిసి నటిస్తాం అంటున్న కమల్..!
Tuesday, January 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
1975లో తొలిసారి రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి అపూర్వ రాగంగళ్ చిత్రంలో నటించారు. ఆతర్వాత వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. చివరిగా గిరఫ్తార్ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో అమితాబ్ కూడా నటించడం విశేషం. ఇదిలా ఉంటే...తమిళనాడులో జల్లికట్టు కోసం యువత నిరసన తెలియచేయడం.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం తెలిసిందే. ఈ నేపధ్యంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ...రజనీకాంత్, నేను కలిసి నటిస్తాం కానీ మమ్మల్ని ఎవరు భరిస్తారు అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తే అభిమానులకు పండగే. కమల్ రజనీతో కలిసి నటిస్తానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎవరైనా ఈ భారీ క్రేజీ కాంబినేషన్లో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments