కమల్ హాసన్ ఆ పనిని కూడా భుజాలకెత్తుకున్నాడు....

  • IndiaGlitz, [Friday,June 10 2016]

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోఈ సినిమా రూపొందనుంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యు.ఎస్.లో స్టార్టయింది. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శృతిహాసన్ నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ రాజీవ్ కుమార్ అనారోగ్యానికి గురవడంతో కమల్ హాసన్ స్వయంగా యూనిట్ ను ముందుండి నడిపిస్తున్నాడట. ప్రస్తుతం యు.ఎస్.లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. సాంగ్ కంపోజిషన్ లో తాను తలమునకలై ఉన్నట్టు కమల్ హాసన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. డైరెక్టర్ రాజీవ్ కు త్వరగా నయం కావాలని కూడా అనుకుంటున్నాడు.