కమల్ సరసన శ్రీదేవి...

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

చీక‌టి రాజ్యంతో ఆక‌ట్టుకున్న క‌మ‌ల్ హాస‌న్ త‌దుప‌రి టి.కె.రాజీవ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. త‌మిళంలో రూపొందే ఈ చిత్రానికి అప్పా అమ్మా విళ‌యాట్టు అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నాన్న అమ్మ ఆట అని అర్ధం. తెలుగులో ఈ టైటిల్ నే ఖ‌రారు చేసిన‌ట్టు సమాచారం.

ఈ చిత్రంలో క‌మ‌ల్ స‌ర‌స‌న జ‌రీనా వ‌హాబ్, అక్కినేని అమ‌ల న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో క‌మ‌ల్ స‌ర‌స‌న అతిలోక సుంద‌రి శ్రీదేవి కూడా న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ప‌ద‌హారేళ్ల వ‌య‌సు, ఎర్ర గులాబీలు, వ‌సంత కోకిల‌, ఆక‌లి రాజ్యం..ఇలా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో క‌మ‌ల్, శ్రీదేవి క‌ల‌సి న‌టించారు. మ‌ళ్లీ ఇప్ప‌డు ఈ మూవీ కోసం క‌మ‌ల్, శ్రీదేవి క‌ల‌సి న‌టిస్తే సెన్సేష‌నే. అలాగే ఈ చిత్రానికి ల‌య‌రాజా ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నార‌ట‌. మ‌రి...ఇన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొందుతున్న క‌మ‌ల్ న్యూమూవీ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

టాకీపార్ట్ పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్'

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’.

మ‌రోసారి ప‌వ‌న్ తో త్రివిక్ర‌మ్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్...వీరిద్ద‌రు మంచి మిత్రులు అనే విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు క‌ల‌సి జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు చేసారు.

బాహుబలి కన్నాఎక్కువ బడ్జెట్ తో రోబో 2

దర్శకధీర రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే.బాహుబలి ని మించేలా బాహుబలి2 ని పక్కా ప్లాన్ తో రూపొందిస్తున్నాడు జక్కన్న.

మరోసారి సింగర్ గా మారుతున్న సర్ధార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మూడోసారి జతకడుతున్నహిట్ పెయిర్..

మూడోసారి జతకడుతున్న హిట్ పెయిర్...ఎవరనుకుంటున్నారా..?ఉయ్యాలా జంపాలా జంట రాజ్ తరుణ్,అవికా గోర్.వీరిద్దరు ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెరకు పరిచయమై..