‘గాడ్సే’ పై కమల్‌ హాసన్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,May 13 2019]

విలక్షణ నటుడు, మక్కల్ నీధి మయామ్ పార్టీ అధినేత కమలహాసన్ గాడ్సేపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని దారుణంగా కాల్చి చంపిన నాధూరాం గాడ్సే, హిందూ మహాసభ నేతేనని, ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి హిందూ టెర్రరిస్ట్ అతనేనని వ్యాఖ్యానించారు. అరవక్కురిచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మక్కల్ పార్టీ నేత మోహన్ రాజ్‌తో కలిసి కమల్‌ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే అని గాంధీ విగ్రహం ముందు నిల్చుని ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు.. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతమైన కరూర్ జిల్లా అరవకురిచ్చిలో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

ఇదిలా ఉంటే కమల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 'హిందుత్వ తీవ్రవాదం' అన్న పదాన్ని వాడినందుకు తనను ఎంతో మంది విమర్శించారని.. అయితే ఏ మతమైనా ప్రేమ, అహింసలను మాత్రమే బోధించిందని కమల్ ఇందుకు మళ్లీ వివరణ కూడా ఇచ్చుకున్నారు. హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా హింసను ప్రోత్సహించదన్నారు. ఖురాన్‌ను నమ్మేవారెవరూ ఉగ్రవాదులు కాలేరని కమల్ హితబోధ చేశారు. అంతటితో ఆగని ఆయన.. కేంద్రంలోని బీజేపీ, ప్రజల మధ్య మతపరమైన విభేదాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని కమల్ వ్యాఖ్యానించారు. కాగా.. ఈనెల 19న తమిళనాడులో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

More News

ఈసారి బాల‌య్య కాదు.. ఆయ‌న విల‌న్ డ‌బుల్ రోల్‌

ఈ మ‌ధ్య బాల‌కృష్ణ చేస్తోన్న సినిమాల్లో సింహా, లెజెండ్ సినిమాలు చాలా పెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లోనూ ఆయ‌న డ్యూయెల్ రోల్ చేశాడు.

జూన్‌లో నితిన్ సినిమా

నితిన్ ఎందుక‌నో చాలా రోజులుగా సినిమాలు చేయ‌డం లేదు. చాలా గ్యాపే తీసుకున్నాడు. యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌దుప‌రి చిత్రం 'భీష్మ‌'. టైటిల్ అనౌన్స్ చేశారు.

‘మహర్షి’తో మహేష్ కాలర్ ఎగరేసి.. అంకితం!

సూపర్‌స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’.

అమ్మా.. నా కోసం ప్రార్థించు అని అడిగేదాన్ని!

ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా..? అని అంటే అది ఒక్క ‘తల్లి ప్రేమ’ మాత్రమే.. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. చెన్నైకి కేసీఆర్ పయనం

తెలంగాణలో సార్వత్రిక, పంచాయితీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.