మీటూపై కమల్ హాసన్ ఏమన్నారంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం మహిళా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ టూ ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా సినిమా రంగంలోని మహిళలు తాము ఎదుర్కొన ఇబ్బందికర పరిస్థితులను తెలియచేస్తున్నారు. నానా పటేకర్, సుభాష్ ఘాయ్, విశాల్ బాశల్ ఇలా చాలా మంది ఆరోపణలు ఎదుర్కొన్నవారే.. మీటూకి మద్ధతుగా అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్స్ గళం విప్పుతున్నారు. బాలీవుడ్‌కి సమాంతరంగా దక్షిణాదిలో కూడా మీటూ ఉద్యమం జరుగుతుంది. దీనిపై కమల్ హాసన్ స్పందించారు. `ఇలాంటి విషయంపై బాధితురాలే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలి. మూడో వ్యక్తి మాట్లాడకూడదు. బయట మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రజలకు తెలియాలి. ఇలాంటి పరిస్థితి కణ్ణగి కాలం నుండి చూస్తున్నాం` అన్నారు కమల్ హాసన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout