కమల్ న్యూమూవీ టైటిల్..

  • IndiaGlitz, [Friday,February 26 2016]

క‌మ‌ల్ హాస‌న్ ఒకేసారి రెండు సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు టి.కె.రాజీవ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, క‌మ‌ల్ కుమార్తె గా శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం. ఈ క్రేజీ మూవీని ఏప్రిల్ లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు క‌మ‌ల్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రానికి ప‌ర‌మ‌ప‌దం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. టి.కె.రాజీవ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత మౌళితో సినిమా ప్రారంభిస్తార‌ని స‌మాచారం. ఆత‌ర్వాత రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల‌ను ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్థంలో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ రెండు సినిమాల‌తో పాటు విశ్వ‌రూపం 2 కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.