Bharatiyadudu 2:అదిరిపోయిన భారతీయుడు2 ఇంట్రో.. గూస్‌బంప్స్ పక్కా..
Send us your feedback to audioarticles@vaarta.com
లోకనాయకుడు కమల్ హాసన్, అగ్ర డైరెక్టర్ శంకర్ కలయికలో ఇండియన్-2 చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రో విడుదలైంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి భారతీయుడు-2 ఇంట్రోను రిలీజ్ చేశారు. అవినీతికి సంబంధించిన సీన్స్ చూపిస్తూ.. "కమ్ బ్యాక్ ఇండియన్" అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్లు చూపించారు.
ఇక మూవీ విజువల్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. రవి వర్మన్ కెమెరా వర్క్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. శంకర్ ట్రేడ్ మార్క్ భారీ సెట్టింగ్స్ స్పష్టంగా చూపించారు. చివర్లో కమల్ "నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్" అంటే చెప్పే హైలెట్‌గా నిలుస్తుంది. మొత్తానికి ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ఇంట్రోలో సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. దీంతో మూవీపై ప్రేక్షకుల్లో హై భజ్ ఏర్పడింది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, లేట్ వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నెడుముడి వేణు, ఢిల్లీ గణేశ్, మనోబాలా, బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా శ్రీమణి సాహిత్యం సమకూర్చారు.
ఇంట్రో చూస్తుంటే మరోసారి భారతీయుడు మ్యాజిక్ చేసేందుకు కమల్, శంకర్ రెడీ అయినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనా మధ్యలో కొన్ని వివాదాల వల్ల చిత్రీకరణ లేట్ అవుతూ వస్తోంది. ఆ వివాదాలు సద్దుమణగడంతో షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com