అప్పుడే 'ఇండియన్ 2' స్టార్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ... 22 ఏళ్ల తర్వాత మరో సినిమా రూపొందనుంది. ఆ సినిమాయే `ఇండియన్ 2`. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1996లో `ఇండియన్` సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మిస్తుంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించి శంకర్ లొకేషన్స్ వేటలో ఉన్నారట. ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన రాయలసీమ జిల్లాల్లో శంకర్ లొకేషన్స్ వెతికారట. ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ చివరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఆలోపు 2.0 విడుదలైపోతుంది కాబట్టే. శంకర్‌కు ఏ సమస్యా ఉండకపోవచ్చు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com