మోహన్‌లాల్ మూవీలో కమల్‌హాసన్....?
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా రూపొందిన `ఓపమ్` మూవీ రీసెంట్‌గా మలయాళం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి `ఓపమ్`పై పడింది. ఈ సినిమాను రీమేక్ చేయడానికి విలక్షణ నటుడు కమల్‌హాసన్ ఆసక్తిగా ఉన్నాడని సినిమా వర్గాలు అంటున్నాయి.
దృశ్యం తర్వాత మోహన్‌లాల్ సినిమాపై కమల్ కన్ను మరోసారి పడింది. అయితే ప్రస్తుతం `శభాష్ నాయుడు` సినిమాతో బిజీగా ఉన్న కమల్ ఆ సినిమా తర్వాత రీమేక్ సినిమా గురించి ఆలోచించే అవకాశాలు కనపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com