రాజ‌శేఖ‌ర్‌తో క‌మ‌ల్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

గ‌డ్డం గ్యాంగ్ త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో న‌టించ‌నున్నాడు. చంద‌మామ‌క‌థ‌లు, గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌వీణ్ స‌త్తార్, చంద‌మామ క‌థ‌లు చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.

ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో స్టైలిష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా రాజ‌శేఖ‌ర్‌ను ప్రెజంట్ చేయ‌నున్నాడు. ఈ చిత్రంలో క‌మ‌ల్‌హాస‌న్‌తో విశ్వ‌రూపం, ఉత్త‌మ‌విల‌న్ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ పూజా కుమార్ న‌టించ‌నుంది.