క‌మ‌ల్ క్లారిటీ ఇచ్చేశాడు

  • IndiaGlitz, [Monday,September 12 2016]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు రెస్ట్‌లో ఉన్నాడు. అయితే సినిమాకు సంబంధించిన రైటింగ్ వ‌ర్క్‌ను మ‌రోసారి చెక్ చేసుకుంటున్నాడు. శభాష్ నాయుడు సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డ్డ క‌మల్ హాస‌న్ అప్ప‌టి నుండి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌లేదు. చిత్రీక‌ర‌ణను తాత్కాలికంగా ఆపేశారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం అవుతుందని క‌మ‌ల్ హాస‌న్ స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌గానే కోలుకుంటున్నాన‌ని, ప‌రీక్షించిన డాక్ట‌ర్లు న‌వంబ‌ర్ నుండి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌వ‌చ్చున‌ని తెలియ‌జేశార‌ని క‌మ‌ల్ హాస‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. సెప్టెంబర్ నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని వినిపిస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కామెడి ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు.