పోలీసులు వేధిస్తున్నారని కోర్టు మెట్లెక్కిన కమల్

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా సెట్‌లో కొన్ని రోజులు క్రితం ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈవీపీ స్టూడియోలో లైటింగ్ కోసం సెట్స్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా క్రేన్ తెగిపడి టెంట్‌పై పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రొడక్షన్ అసిస్టెంట్లు ప్రమాద స్థలిలోనే కుప్పకూలారు. అయితే ఈ ఘటనలో పోలీసులు డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌కు నోటీసులిచ్చారు. విచారణ హాజరుకావాలని సీఐడీ కూడా నోటీసులు జారీ చేసింది.

అయితే ఈ విషయంలో తనను పోలీసులు వేధిస్తున్నారని కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. కమల్ అభ్యర్థన మేరకు ఈ పిటిషన్‌ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. ఇవాళ ఈ మధ్యాహ్నం విచారణకు రానుంది. అయితే.. కమల్‌ను పోలీసులు ఎందుకు ఇబ్బందిపెడుతున్నారు..? ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు..? అసలు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..? అనే విషయాలు తీర్పు అనంతరం తేలనున్నాయి.

More News

నా బర్త్ డే వేడుకలు వాయిదా వేస్తున్నా : కలెక్షన్ కింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

ఇలా జీవించాల్సి వస్తుండటం చాలా బాధాకరం..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

కరోనా ఎఫెక్ట్ : నేటి నుంచి షిరిడీ ఆలయం మూసివేత

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఏపీ సర్కార్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నిమ్మగడ్డ!

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిదే.

‘చిత్రం X’ ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో, బేబీ రాజశ్రీ సమర్పణలో.. రాజ్ బాల, మానస హీరో హీరోయిన్లుగా