close
Choose your channels

Kamal Haasan:కమల్ హాసన్, మణిరత్నం కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. పూనకాలు అంతే..

Monday, November 6, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలయికలో దాదాపు 36 ఏళ్ల తరువాత ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రేపు(మంగళవారం) కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ గ్లింప్స్‌లో ఓ ఫైట్ సీక్వెన్స్ చూపించారు. ఇందులో కమల్ తన పేరు, తానెవరో చెబుతూ ఫైట్ చేస్తాడు. ఇందులో మణిరత్నం టేకింగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇక రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే వేరే లెవల్ అంతే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో జయం రవి, త్రిష నటించబోతున్నట్లు కూడా ప్రకటించారు.

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా చివరగా ‘నాయకుడు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పటినుంచి ఇద్దరి కాంబోలో మరో సినిమా రాకపోవడం గమనార్హం. మూడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయనున్నారనే వార్త సినిమా వర్గాల్లో ఆసక్తి రేపింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా? అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌తో మూవీపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు.

ఇక కమల్ హాసన్, అగ్ర డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతోన్న భారతీయుడు-2 చిత్రం నుంచి ఇటీవల విడులై ఇంట్రో విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంట్రలో వీడియోలో "నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్" అంటూ కమల్ చెప్పే హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ఇంట్రోలో సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, లేట్ వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, తదితరులు నటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment