Kamal Haasan:కమల్ హాసన్, మణిరత్నం కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. పూనకాలు అంతే..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలయికలో దాదాపు 36 ఏళ్ల తరువాత ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రేపు(మంగళవారం) కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ గ్లింప్స్‌లో ఓ ఫైట్ సీక్వెన్స్ చూపించారు. ఇందులో కమల్ తన పేరు, తానెవరో చెబుతూ ఫైట్ చేస్తాడు. ఇందులో మణిరత్నం టేకింగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇక రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే వేరే లెవల్ అంతే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో జయం రవి, త్రిష నటించబోతున్నట్లు కూడా ప్రకటించారు.

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా చివరగా ‘నాయకుడు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పటినుంచి ఇద్దరి కాంబోలో మరో సినిమా రాకపోవడం గమనార్హం. మూడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయనున్నారనే వార్త సినిమా వర్గాల్లో ఆసక్తి రేపింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా? అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌తో మూవీపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు.

ఇక కమల్ హాసన్, అగ్ర డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతోన్న భారతీయుడు-2 చిత్రం నుంచి ఇటీవల విడులై ఇంట్రో విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంట్రలో వీడియోలో నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ కమల్ చెప్పే హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ఇంట్రోలో సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, లేట్ వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, తదితరులు నటించారు.