విక్రమ్ సరసన కమల్ తనయ?

  • IndiaGlitz, [Monday,July 10 2017]

క‌మ‌ల్‌హాస‌న్ ఇంట్లో క‌ళామ‌తల్లి కొలువై ఉంటుంద‌ని అంటారు. క‌మ‌ల్‌హాస‌న్ స్వ‌త‌హాగా న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, డ్యాన్స్ మాస్ట‌ర్‌.. ఒక‌టేంటి.. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. ఆయ‌న పెద్ద త‌న‌య శ్రుతిహాస‌న్ అటు న‌ట‌న‌లోనూ, ఇటు సంగీతంలోనూ ఇప్ప‌టికే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది. రెండో త‌న‌య అక్ష‌ర‌హాస‌న్ ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసింది. బాలీవుడ్‌లో అమితాబ్‌, ధ‌నుష్ న‌టించిన 'ష‌మితాబ్‌'తో మంచి పేరు తెచ్చుకుంది. త‌మిళ్‌లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అజిత్ సినిమాకు సంత‌కం చేసింది.
ఆమె న‌టించిన 'వివేగ‌మ్' వ‌చ్చే నెల్లో విడుద‌ల కానుంది. దాంతో పాటు ఆమె తాజాగా విక్ర‌మ్ సినిమాకు కూడా సంత‌కం చేసింది. విక్ర‌మ్ అన‌గానే అపరిచితుడు ఫేమ్ విక్ర‌మ్ అనుకునేరు. కాదండోయ్‌.. విక్ర‌మ్ ర‌విచంద్ర‌న్ క‌న్న‌డ న‌టుడు. క‌న్న‌డ స్టార్ హీరో ర‌విచంద్ర‌న్ త‌న‌యుడు. విక్ర‌మ్ తొలి సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ్‌లో కూడా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ సినిమాలో నాయిక‌గా అక్ష‌ర‌ను ఎంపిక చేశారు. సో అటు ఉత్త‌రాది సినిమాల‌తో పాటు నెమ్మ‌నెమ్మ‌దిగా ద‌క్షిణాది చిత్రాల్లో కూడా త‌న స‌త్తా చూప‌డానికి ప్రిపేర్ అవుతోంద‌న్న‌మాట అక్ష‌ర‌హాస‌న్‌.

More News

రాధిక భర్తకు దూరంగా ఉంటోందా?

కన్నడ నటి రాధిక తన భర్త కుమారస్వామికి దూరంగా ఉంటోందా?.. అవుననే పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక 2006లో పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు.

సురేందర్ రెడ్డి కొత్త వ్యాపారం

సురేందర్రెడ్డి పేరు వినగానే టాలీవుడ్ స్టైలిష్ డైరక్టర్ అనే మాట గుర్తుకొచ్చేస్తుంది. ఆయన తెరకెక్కించే సినిమాల్లో స్టైలిష్ అంశాలు ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తూనే ఉంటాయి.

జైలుకెళ్లిన మెగా హీరో

మెగా హీరో శనివారం జైలు కెళ్లారు..అదేదో నేరం చేసి వెళ్లారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

తాప్పీ ..ఇది చాలా తప్పు...

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అదితి ఆర్యకు ఈసారైనా కలిసొస్తుందా...

2015లో మిస్ ఇండియాగా ఎన్నికైంది ఆదితి ఆర్య.