వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసేసిన కమల్
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌కు సినిమాపై మంచి పట్టు ఉంది. హీరోగానే కాదు.. నిర్మాతగా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా అన్నింటిలో తనదైన ముద్ర వేశారాయన. రీసెంట్గా ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్‌తో కలిసి లైవ్‌చాట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. కమల్ హాసన్ నటుడిగా మెప్పించిన చిత్రాల్లో క్షత్రియ పుత్రుడు ఒకటి. శివాజీ గణేశన్, రేవతి ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
క్షత్రియపుత్రుడు సినిమాకు కమల్ హాసనే స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్ అందించారు. సినిమాకు స్క్రిప్ట్ రాసే సమయంలో కమల్ హాసన్ స్నేహితుడొకరు స్క్రిప్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని లేకుంటే సినిమా నుండి తప్పుకుంటానని అన్నారట. ఓ పక్క ఛాలెంజింగ్‌గా తీసుకున్నప్పటికీ మరో పక్క చిన్న పాటి టెన్షన్ కూడా ఉండిందట. అయితే తక్కువ సమయంలోనే స్క్రిప్ట్ రాస్తానని స్నేహితుడితో అన్నాడట. ఏడు రోజుల్లోనే ఆ స్క్రిప్ట్‌ను పూర్తి చేశానని కమల్ తెలిపారు. అయితే అన్నీ స్క్రిప్ట్స్‌ను అలా రాయలేమని కొన్ని స్క్రిప్ట్స్ సంవత్సరం సమయం తీసుకుంటే మరికొన్ని నెలరోజుల్లోనే పూర్తి కావచ్చు. కొన్ని సందర్భాల్లో సూట్ కేసు నిండా డబ్బులు ఇచ్చినా తాను త్వరగా పనిచేయలేనని అని కమల్ తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments