భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసిన కమల్ హాసన్
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 23 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియన్ 2`. 1996లో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన `ఇండియన్`కు ఇది సీక్వెల్. ఈ సీక్వెల్లో కమల్ హాసన్‌తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు షెడ్యూల్‌ను బోపాల్‌లోని ఓ ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారట.
పీటర్ హెయిన్స్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తయ్యింది. కమల్ హాసన్ పుట్టినరోజు వేడుకల సెలబ్రేషన్స్ కోసం యూనిట్ గ్యాప్ తీసుకుంది. వెంటనే మధ్య ప్రదేశ్‌లోనే మరికొన్ని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
ఈ సినిమా కోసం వయసు మళ్లిన సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి తెరపై కనపడనున్నారు. కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన నటిస్తుంటే.. సిద్ధార్థ్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంది. సినిమాలో కమల్ 90 ఏళ్ల వ్యక్తిగా కనపడుతుంటే రకుల్ 80 ఏళ్ల ముసలి బామ్మగా కనపడునుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com