40 ఏళ్ల క్రితం టైటిల్‌తో క‌మ‌ల్ హాస‌న్‌..!

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా 'ఖైదీ'తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్‌హాస‌న్ 232వ సినిమా ఇది. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వ‌న్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్‌డ్ ఎ ఘోస్ట్‌' అనే ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్‌మెంట్ చేసిన ఈ చిత్రానికి టైటిల్‌ను ఖ‌రారు చేయ‌లేదు. అయితే ప్రారంభంలో ఈ సినిమాకు 'ఎవ‌నెండ్రు నిన్నైతాయి' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో టైటిల్ చేరింది. ‘గురు’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. 40 ఏళ్ల క్రితం ఇదే టైటిల్‌తో క‌మల్‌హాస‌న్ సినిమా చేయ‌డం , అదే టైటిల్ మ‌రోసారి ఆయ‌న సినిమాకే ప‌రిశీల‌న‌లో ఉండ‌టం విశేషం.

యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నిజానికి ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'భార‌తీయుడు 2' సినిమా చేస్తున్న ఈ సమ‌యంలో క‌మ‌ల్ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది చూస్తుంటే.. భార‌తీయుడు 2 హోల్డ్‌లో ప‌డిన‌ట్లే అని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. మ‌రో ప‌క్క క‌మ‌ల్ హాసన్ బిగ్‌బాస్ సీజ‌న్ 4తో పాటు.. రాజ‌కీయాల్లో బిజీగా ఉంటున్నారు.

More News

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌..

ముంబై: డ్రగ్స్‌ కేసులో నటుడు సుశాంత్ చక్రవర్తి ప్రియురాలు రియా చక్రవర్తికి బెయిల్‌ లభించింది. గత నెల 9 నుంచి ముంబై బైకుల్లా జైలులో రియా ఉంది.

‘క్రాక్‌’ మొదలెట్టేశారు...!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ లేటెస్ట్ చిత్రం` క్రాక్‌`. ఈ ఏడాది వేస‌విలో ఈ సినిమా విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ కార‌ణంగా తుది ద‌శ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఆగింది.

బ‌రిలోకి దిగుతున్న య‌ష్‌

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’.

శాంతించిన ఓపీఎస్.. ఈపీఎస్‌కు లైన్ క్లియర్..

గత కొద్ది రోజులుగా హాట్ హాట్‌గా నడుస్తున్న తమిళ రాజకీయాల్లో ఎట్టకేలకు ప్రశాంతత నెలకొంది. సీఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం  సీనియర్‌ మంత్రులు,

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారధి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నవంబర్ లేదంటే డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు.