'చీకటి రాజ్యం' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,November 20 2015]

క‌మ‌ల్‌హాస‌న్ సినిమా అంటే త‌మిళ ప్రేక్ష‌కుల సంగ‌తేమో కానీ తెలుగు ప్రేక్ష‌కులు మాత్రం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. అదీ కాకుండా సాగ‌ర‌సంఘ‌మం వంటి స‌హా ప‌లు తెలుగు స్ట్ర‌యిట్ సినిమాల్లో కూడా క‌మ‌ల్ న‌టించి స‌క్సెస్ సాధించాడు. చాలా ఏళ్ళ త‌ర్వాత గాలి మ‌ళ్ళిందో ఏమో కానీ చాలా సంవ‌త్స‌రాలు త‌ర్వాత క‌మ‌ల్ చేసిన స్ట్ర‌యిట్ తెలుగు సినిమాయే చీక‌టి రాజ్యం. మ‌రి చీక‌టి రాజ్యంతో త‌న వ‌ద్ద ఉన్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ రాజేష్‌.ఎం సెల్వ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. మ‌రి చీక‌టిరాజ్యంంలో క‌మ‌ల్ చీక‌టి వెనుక ఏం జ‌రుగుతుందో చెప్పాల‌నుకున్నాడా, మ‌రేదైనా చెప్పాల‌నుకున్నాడా అనేది తెలియాలంటే సినిమా క‌థ లోకి వెళ‌దాం...

క‌థ‌

నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ ఆఫీస‌ర్ అయిన దివాక‌ర్‌(క‌మ‌ల్‌హాస‌న్‌) డ్యూటీని సిన్సియ‌ర్‌గా చేస్తుంట‌డంతో అత‌ని భార్య డాక్ట‌ర్ సుజాత‌(ఆశా) అత‌నికి విడాకులు ఇచ్చేస్తుంది. కుమారుడు వాసును మాత్రం దివాక‌ర్ ద‌గ్గ‌ర ఉంటాడు. తండ్రిని త‌న‌ని స‌రిగా ప‌ట్టించుకోడ‌ని కొడుకు అనుకుంటూ ఉంటాడు. అయితే ఓ ప్లాన్‌లో భాగంగా దివాక‌ర్, అత‌ని స్నేహితుడు మ‌ణి క‌లసి ఓ డ్ర‌గ్ ముఠాపై దాడి చేసి డ్ర‌గ్స్ సంపాదిస్తారు. అయితే ఆ డ‌గ్ర్స్‌తో వ్యాపారం చేసే విఠ‌ల్‌రావు(ప్ర‌కాష్ రాజ్‌), దివాక‌ర్ కొడుకు వాసును కిడ్నాప్ చేసి త‌నకు డ్ర‌గ్స్ ఇచ్చేస్తే కొడుకుని వ‌దిలేస్తానంటాడు. డ్ర‌గ్స్‌ను ఓ చోట దాచి విఠ‌ల్‌రావు ద‌గ్గ‌ర‌కు దివాకర్ వెళ‌తాడు. మిస్ అవుతుంది. అప్పుడు దివాక‌ర్ ఏం చేసాడు? అస‌లు దివాక‌ర్‌కు డ్ర‌గ్స్ ఎందుకు అవ‌స‌రం? అస‌లు ఈ ప్లాన్ వెనుక సూత్ర‌ధారి ఎవ‌రు? చివ‌ర‌కు దివాక‌ర్ త‌న కొడుకు కాపాడుకుంటాడా? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్‌

సినిమా ప్రారంభం నుండి క‌మ‌ల్ ఎంట్రీ ఉండ‌టంతో సినిమా చూసే క‌మ‌ల్ అభిమానులు హ్య‌పీగా ఫీల‌వుతారు. సినిమా మొత్తాన్ని క‌మ‌ల్ త‌న భుజాల‌పై మోశారు. ఇదేం ఆయ‌న‌కు కొత్త కాదనుకోండి. ఇక ఓ టీనేజ్ కుర్రాడి తండ్రిగా మిడిల్ ఏజ్ ఆఫీస‌ర్‌గా కొత్త‌లుక్‌లో క‌నిపించారు. సినిమా స్క్రీన్ ప్లే బావుంది. క‌మ‌ల్ న‌ట‌న గురించి డిస్క‌ష‌న్ అన‌వ‌స‌రం. కుమ్మేశాడు. త్రిష నార్కోటిక్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అల‌రించింది. లుక్స్ ప‌రంగా గ్లామ‌ర్‌గా క‌నిపించింది. విల‌న్‌గా చేసిన ప్ర‌కాష్ రాజ్‌, సంప‌త్ రాజ్, మిగిలిన పాత్ర‌ల్లో మ‌ధుశాలిని, కిషోర్ స‌హా అంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. జిబ్రాన్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. శాను ఫోటోగ్ర‌ఫీ, ప్రేమ్ న‌వాస్ ఆర్ట్ డైరెక్ష‌న్‌, కునాల్ రాజ‌న్ సౌండ్ డిజైనింగ్ బావున్నాయి.

మైన‌స్ పాయింట్స్

సినిమా ఓ హ‌లీవుడ్ సినిమా కాన్సెప్ట్. సినిమా ప్రారంభంలోనే అస‌లు సూత్ర‌ధారి ఎవ‌రో తెలిసిపోవ‌డంతో క్లయిమాక్స్ మిన‌హా మిగిలిన క‌థంతా ప్రేక్ష‌కుడి ఉహ ప్ర‌కారం సాగుతుంది. అందువ‌ల్ల ప్రేక్ష‌కుడికి పెద్ద‌గా ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు సినిమాలో ఏమీ ఉండ‌వు. ఈ త‌ర‌హా క‌థ‌లు హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ఓకే, కామెడిని కోరుకునే టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఈ సినిమా ఆక‌ట్టుకోదు. సినిమా అంతా సింపుల్‌గానే ఎమోష‌న‌ల్ కంటెంట్‌తోనే సాగుతుంది. . న‌ర్సు పాత్ర‌లో మ‌ధుశాలిని త‌న ప‌రిధిలో బాగానే న‌టించింది.కానీ ఆమెను లిప్‌లాక్‌ల కోస‌మే తీసుకున్నారా అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌

సినిమా అంతా చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. సినిమా నిడివి కూడా త‌క్కువ‌గా ఉండ‌టం బాగా క‌లిసొచ్చింది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ చాలా వేగంగా గ‌డిచిపోతుంది. సెకండాప్ కాస్తా డ్రాగింగ్‌గా అనిపిస్తుంది. పాతికేళ్ళ త‌ర్వాత క‌మ‌ల్ సినిమా అన‌గానే ఎలాంటి సినిమాతో వ‌స్తున్నారో, ఏం చెబుతున్నారోన‌ని స‌గ‌టు ప్రేక్ష‌కులు ఎదురుచూశారు. సినిమా అంతా రోడ్ సీన్స్‌, ప‌బ్‌లోనే తీసేశారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ కాబ‌ట్టి కామెడికి అవ‌కాశం లేకుండా పోయింది. మంచి న‌టీన‌టులు యాడ్ కావ‌డంతో న‌ట‌న ప‌రంగా సినిమా బాగా క‌న‌ప‌డింది. సినిమాటోగ్ర‌ఫీ, ఆర్ట్ వ‌ర్క్‌, మ్యూజిక్‌, ఆర్.ఆర్ స‌హా టెక్నిక‌ల్ అంశాలు బావున్నాయి. స్క్రీన్ ప్లే అంతా ఇంగ్లీష్ మూవీ స్ట‌యిల్ లో ఉంది. మ‌ల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు సినిమా బాగా న‌చ్చుతుంది. మ‌రి బి, సి సెంటర్స్‌లో ప్రేక్ష‌కుల రెస్పాన్స్ చూడాలి మ‌రి...

బాట‌మ్ లైన్‌: చీక‌టి రాజ్యం...ఫాస్ట్ ఫేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

రేటింగ్‌: 3/5

English Version Review

More News

మనోజ్ 'శౌర్య' ఫస్ట్ లుక్ విడుదల

బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ఇండియా ప్రై.లి.బ్యానర్పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం శౌర్య.

మనోజ్ న్యూమూవీ ఫస్ట్ లుక్ రిలీజ్...

మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రానికి శౌర్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు.దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో మనోజ్ సరసన రెజీనా నటిస్తుంది.

చరణ్ - పవన్ సినిమాకి డైరెక్టర్ మారాడా...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారన్న విషయం తెలిసిందే.ఇటీవల సర్ధార్ సెట్ లో బాబాయ్ పవన్ ని అబ్బాయ్ చరణ్ కలసి సినిమా గురించి చర్చించారు.

రత్నవేలుకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదట..

రత్నవేలు..ఇండియాలో టాప్ టెక్నిషియన్స్ లో ఒకరు.ఆయన సుకుమార్ కు మంచి స్నేహితుడు.

డిసెంబర్ 20న 'డిక్టేటర్' ఆడియో

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ 'డిక్టేటర్'.