క‌మ‌ల్‌.. మెచ్చుకున్నారు!

  • IndiaGlitz, [Friday,October 05 2018]

రొటీన్‌కి భిన్నంగా ఉండే సినిమాలు ఎప్పుడైనా ప్ర‌శంస‌లు పొందుతూనే ఉంటాయి. అందులోనూ స‌మాజంలో త‌క్కువ‌గా చూడ‌బ‌డే సామాజిక వ‌ర్గాల‌కు సంబంధించిన అంశాల‌ను రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో తీస్తే త‌ప్ప‌కుండా ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కుతుంది.

తాజాగా త‌మిళంలో విడుద‌లైన అలాంటి చిత్రం ప‌రియేరుం పెరుమాళ్‌. కేస్ట్ బేస్డ్ సినిమా ఇది. ర‌జ‌నీకాంత్‌తో సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు పా.రంజిత్ తెర‌కెక్కించారు. ఆయన ఈ సినిమాను మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ అధ్య‌క్షుడు క‌మ‌ల్‌హాస‌న్ కోసం స్పెష‌ల్‌స్క్రీనింగ్ వేశారు.

ఈ సినిమాను చూసి క‌మ‌ల్ మెచ్చుకున్నారు. ఇలాంటి మంచి స్ట‌ఫ్ తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాలు న‌లుగురి దృష్టికీ వ‌స్తాయ‌ని, ఇలాంటి అంశాల‌పై త‌మ గొంతుక‌ను వినిపించ‌డానికి ఈ నిర్మాత‌లు ఎప్పుడూ ముందుండాల‌ని ప్రోత్స‌హించారు.