కమల్, గౌతమిల 13 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాఫ్..!

  • IndiaGlitz, [Tuesday,November 01 2016]

త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన సీనియ‌ర్ హీరోయిన్ గౌత‌మి. ఈ క‌థానాయికకి క్యాన్స‌ర్ వ్యాధి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆత్మ‌స్థైర్యంతో త‌ట్టుకుని నిల‌బ‌డింది. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. ఈ టైమ్ లో గౌత‌మికి అండ‌గా నిలిచి త‌న‌లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచారు యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్. దీంతో క‌మ‌ల్, గౌత‌మి మ‌ధ్య అనుబంధం పెరిగి 13 ఏళ్లుగా క‌లిసి జీవించారు. గౌత‌మికి సుబ్బుల‌క్ష్మి అనే కూతురు ఉంది. క‌మ‌ల్ గౌత‌మి కూతురును కూడా శృతిహాస‌న్, అక్ష‌ర హాస‌న్ వ‌లే ఎంకరేజ్ చేసేవారు.
అయితే...ఇటీవ‌ల శ‌భాష్ నాయుడు షూటింగ్ టైమ్ లో గౌత‌మి, శృతిహాస‌న్ కు మ‌ధ్య కాస్టూమ్స్ విష‌యంలో డిఫ‌రెన్స్ వ‌చ్చాయి. ఆత‌ర్వాత అంతా సెట్ అయ్యింది అని శృతిహాస‌న్ కూడా చెప్పింది. మ‌రి ఏమైందో ఏమో కానీ....ఈరోజు గౌత‌మి ట్విట్ట‌ర్ లో లైఫ్ అండ్ డిసిష‌న్స్ అంటూ ఓ లెట‌ర్ పోస్ట్ చేసింది. అందులో క‌మ‌ల్ హాస‌న్ తో 13 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ ప‌డింది. ఈ వార్త చెప్ప‌డానికి చాలా బాధ‌గా ఉంది. 13 ఏళ్ల బంధం నుంచి బ‌య‌ట‌కు రావాలంటే అంత సులువు కాదు. అన్ని ఆలోచించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి నాకు ఇంత టైమ్ ప‌ట్టింది. నాకు ఓ కూతురు ఉంది. దానిని తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త నాది. క‌మ‌ల్ హాస‌న్ అభిమానిని. ఆయ‌న సినిమాల‌కు కాస్టూమ్స్ డిజైన‌ర్ గా వ‌ర్క్ చేయ‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. నాకు అండ‌గా నిలిచిన వారంద‌కీ థ్యాంక్స్ అంటూ త‌న మ‌న‌సుని ఈ లేఖ‌ ద్వారా ఆవిష్క‌రించారు గౌత‌మి..!