కమల్ స్థానంలో సూర్య....ఎన్టీఆర్ స్థానంలో...
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తరాదిన కమల్ హాసన్, దక్షిణాదిన ఎన్టీఆర్ హోస్ట్‌లుగా ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ పూర్తయ్యింది. మరి సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అందరూ అనుకుంటున్న తరుణంలో వచ్చే ఏడాది ఈ బిగ్‌బాస్ సెకండ్ సీజన్ ప్రారంభమవుతుందని సమాచారం.
అయితే మొదటి షోలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన కమల్, ఎన్టీఆర్‌లు అటు తమిళం, ఇటు తెలుగులో వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోరట. అందుకు కారణం వారికున్న కమిట్మెంట్స్. కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుంటే, ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. కాబట్టి సెకండ్ సీజన్స్‌లో హోస్ట్‌లు మారుతారని వార్తలు వినపడుతున్నాయి. తమిళంలో కమల్‌హాసన్ స్థానంలో సూర్య హోస్ట్‌గా చేయబోతాడని వార్తలు వస్తుంటే, తెలుగులో ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్ట్ చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments