ఇజం మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతి హీరో బాడీ లాంగ్వేజ్‌ను డిఫరెంట్‌గా ప్రెజంట్ చేసే దర్శకుడు పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని ఈ తరం యంగ్ హీరోస్ అనుకుంటుంటారు. పూరి సినిమాలో హీరో అంటే రఫ్‌లుక్, సిక్స్‌ప్యాక్ బాడీతో పాటు ఉన్నది ఉన్నట్లు చెప్పే నైజం ఉంటుంది. ఆరగేంట్ పర్సనాలిటీగా హీరోను ప్రెజెంట్ చేస్తూనే సినిమాలో ఏదో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటాడు పూరి. అలా స్టయిల్లో వచ్చిన సినిమాయే `ఇజం`. నందమూరి కళ్యాణ్‌రామ్‌ను కూడా పూరి తన స్టయిల్లో చూపించే ప్రయత్నం చేశాడు. అందుకని కళ్యాణ్‌రామ్‌తో సిక్స్‌ప్యాక్ కూడా చేయించడం విశేషం. ఎన్టీఆర్‌కు టెంపర్ వంటి మంచి సక్సెస్నిచ్చిన పూరి..కల్యాణ్‌రామ్‌కు ఎలాంటి సక్సెస్నిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు కూడా మరి అందరి అంచనాలను అందుకునేలా పూరి ఇజంను రూపొందించాడా? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథః
ఇజం కథ రెండు పార్టులుగా చెప్పవచ్చు...
పార్ట్1ః ఎవరికీ కనపడకుండా ఇండియాలో అండర్ వరల్డ్ కార్యకలాపాలను నిర్వహించే డాన్ జావేద్(జగపతిబాబు)కు అతని కూతురు అలియా ఖాన్(ఆదితి ఆర్య) అంటే ప్రాణం. జావేద్ బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ను స్థాపించి ఇండియాలో పొలిటీషియన్స్ సంపాదించే బ్లాక్ మనీని దాచిపెడుతుంటాడు. జావేద్ కుమార్తె ఓ సందర్భంలో అలియాను స్ట్రీట్ ఫైటర్ కళ్యాణ్(కళ్యాణ్‌రామ్)తో ప్రేమిస్తాడు. జావేద్ తనెవరో చెప్పకుండా కళ్యాణ్‌తో బీడి స్నేహితుడిగా మారుతాడు. ఓసారి కళ్యాణ్ ప్రేమిస్తుంది తన కూతురేనని తెలియకుండా అతని ప్రేమకు సహాయపడతాడు. జావేద్ సలహా వల్ల అలియా కళ్యాణ్ ప్రేమలో పడుతుంది. అయితే చివరకు కళ్యాణ్ ప్రేమిస్తుంది తన కూతురేనని తెలుసుకునేటప్పటికీ కళ్యాణ్ గురించి జావేద్‌కు ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజమేంటి?
పార్ట్2ః దేశంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్పడుతున్న ఆక్రమాలను గ్రాండ్ లీకేజ్ అనే వెబ్ సైట్ తెలియజేస్తుంటుంది. కానీ గ్రాండ్ లీకేజీని ఎవరు నడుపుతున్నారనేది ఎవరికీ తెలియదు. ఓ సందర్భంలో దేశంలో రాజకీయ నాయకుల వద్ద ఉన్న బ్లాక్ మనీ గురించి వివరాలను గ్రాండ్ లీకేజీ సంస్థ బయటపెడుతుంది. దాంతో దేశం అంతా ఉలిక్కి పడుతుంది. కానీ రాజయ నాయకులు తమ అదికారం ఉపయోగించి గ్రాండ్ లీకేజ్ సభ్యులను వెతుకుతుంటారు. చివరకు గ్రాండ్ లీకేజ్‌ను నడిపే వ్యక్తి ఎవరో కనిపెడతారు. గ్రాండ్ లీకేజ్‌ను నడిపేదెవరు? అసలు గ్రాండ్ లీకేజ్ చెప్పే విషయాలన్నీ నిజాలేనా? అనే విషయాలను తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్ః
- కళ్యాణ్ రామ్ నటన
- సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
- పూరి డైలాగ్స్
మైనస్ పాయింట్స్ః
- ఫస్టాఫ్
- క్లైమాక్స్
సమీక్షః
పూరి స్టయిల్లో ఎప్పటిలాగానే కళ్యాణ్ రామ్ అరగేంట్ పర్సనాలిటీతో కనిపించాడు. కళ్యాణ్ రామ్ నటన అందరినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో కోర్టు సీన్లో ఎమోషనల్‌గా చక్కటి అభినయాన్ని కనపరిచాడు. సిక్స్ ప్యాక్‌లో కళ్యాణ్ రామ్ లుక్ బావుంది. హీరోయిన్ ఆదితి ఆర్య చూడటానికి బావుంది. కానీ నటన విషయంలో కాస్తా వెనకపడిందనే చెప్పాలి. ఇక డాన్ పాత్రలో నటించిన జగపతిబాబు క్యారెక్టర్ తేలిపోయింది. సినిమా ప్రారంభంలో జగపతిబాబు క్యారెక్టర్‌కు ఇచ్చిన బిల్డప్‌కు, సినిమాలో అతని పాత్రను చిత్రీకరించిన తీరుకు పొంతనే ఉండదు. అలీ, వెన్నెల కిషోర్, ఈశ్వరీరావు, తనికెళ్లభరణి, కళ్యాణ్‌రామ్ స్నేహితులుగా నటించినవారు అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నిషియన్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది పూరి జగన్నాథ్ గురించి...పూరి అనుకున్న పాయింట్ చాలా చక్కగా ఉంది. పూరి చెప్పాలనుకున్న విషయాన్ని ఇంటర్వెల్ తర్వాత నుండి ప్రీ క్లైమాక్స్‌లోనే చెప్పేశాడు. నిజం చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్‌లోనే సినిమా ముగిసింది. కానీ క్లైమాక్స్‌లో వచ్చే పాట, సాంగ్‌తో సినిమా అనవసర సాగదీతగా అనిపించింది. ఇక ఇంటర్వెల్ ముందు వరకు ఫస్టాఫ్ల్ అంతా స్లోగా, బోరింగ్‌గా సాగుతుంది. మన రూపాయి విలువ డాలర్ కంటే వెనకబడటానికి కారణం. లంచం...ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరనీయకుండా మన దేశంలో రాజకీయ నాయకులు లక్షలు కోట్లు బ్లాక్ మనీని సంపాదించి ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో దాస్తున్నారు. దాని వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్య ఏర్పడమే కాకుండా రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలి వంటి సమస్యలు వస్తున్నాయి. సమస్యలకు పరిష్కారం విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని మనదేశానికి రప్పించడమే అని ఇజంలో పూరి చూపించాడు. స్వాతంత్రానికి ముందు తెల్లవాళ్లు దేశాన్ని దోచుకున్నారని చదువుకుంటున్నాం కానీ వాళ్లు మనకు రోడ్లు, రైలు, నౌకాయానం, విమానం, అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలను నేర్పించారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత మనల్ని మనమే దోచుకుంటున్నాం..ఇప్పుడు మనం చదువుకోవాల్సిందే ఎప్పుడో దేశాన్ని దోచుకున్న తెల్లవాడి గురించి కాదు..ఇప్పుడు దేశాన్ని దోచుకుంటున్న నల్లవాడి గురించే...బ్లాక్‌లో కొందామనుకున్నామంచివాడనేవాడు కనపడటం లేదు...వంటి డైలాగ్స్‌తో పూరి తనలో రచయితకు బాగానే పనిచెప్పాడు. ఇంటర్వెల్ ముగిసిన తర్వాత నుండి ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను పూరి ఆసక్తికరంగా నడిపాడు. జి.ముఖేష్ సినిమాటోగ్రఫీ బావుంది. అనూప్ అందించిన సంగీతం కనులు నీవైనా అనే సాంగ్..హీరోయిన్ టీజింగ్ సాంగ్ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. ఎడిటింగ్ బాలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్ః ఇజం..మెసేజ్ ఉన్న పూరి మార్కు సినిమా
రేటింగ్ః 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com