ఆ విషయంలో కల్యాణ్‌రామ్‌కి కష్టంగా ఉందా?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కల్యాణ్‌రామ్ తొలిసారి సంక్రాంతి సందర్భంగా `ఎంతమంచివాడవురా` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అధికారకంగా `ఎంత మంచివాడవురా` సినిమా జనవరి 15న విడుదలవుతుంది. అయితే ఈ సినిమాకు మహేశ్ `సరిలేరు నీకెవ్వరు`, బన్నీ `అల..వైకుంఠపురములో..` రూపంలో గట్టి పోటీ నెలకొంది. ఇద్దరు స్టార్ హీరోల మధ్య కల్యాణ్‌రామ్ సినిమా వస్తుండటంతో సినిమాపై అంచనాలు లేవని, అందుకనే బాక్సాఫీస్ వద్దనే క్రేజ్ లేకుండా పోయిందట. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకు గడ్డుకాలమేనట. నిర్మాతలు సినిమా బిజినెస్ కాకపోవడంతో టెన్షన్ పడుతున్నారని సమాచారం.
కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఎంత మంచివాడవురా`. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments