మెహరీన్ స్థానంలో కళ్యాణి ప్రియదర్శన్?
Send us your feedback to audioarticles@vaarta.com
ఐరా క్రియేషన్స్ సంస్థను స్థాపించి.. ఆ సంస్థలో మొదటి చిత్రంగా ‘ఛలో’ సినిమాను నిర్మించారు యువ కథానాయకుడు నాగశౌర్య. ఈ సినిమా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయింది. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. ఈ సినిమాతో విజయాన్ని అందుకుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు ఈ హీరో. ఇప్పుడు ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ యువ కథానాయకుడు. ఈ నేపథ్యంలో తన సంస్థలో నిర్మిస్తున్న ‘@నర్తనశాల’ సినిమాతో కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తిని పరిచయం చేస్తున్నారు.
తాజాగా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా మెహరీన్ నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆమె స్థానంలో ‘హలో’ భామ కళ్యాణి ప్రియదర్శిని నాయికగా నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో తనకు జోడిగా కళ్యాణి అయితే బాగుంటుందని నాగశౌర్య భావించడంతో.. కథానాయిక విషయంలో మార్పు చోటుచేసుకుందని చిత్ర బృందం చెబుతోంది. ఇదిలా ఉంటే.. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ ఈ నెల 27న విడుదల కానుండగా.. సాయిపల్లవితో కలిసి నటించిన బైలింగ్వల్ మూవీ ‘కణం’ మే 20న రిలీజ్ కానుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com