‘రణరంగం’ లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది! - కళ్యాణి ప్రియదర్శన్

  • IndiaGlitz, [Monday,August 12 2019]

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటీనటులుగా సుధీర్ వర్మ తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రాన్ని పిడివి ప్రసాద్ సమర్పిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే సినిమాకు సంబంధించ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌ అండ్ లిరికల్ సాంగ్స్‌కి సూపర్బ్ అనిపించాయి. తాజాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నటి కల్యాణి ప్రియదర్శిని మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్.. మరీ ముఖ్యంగా హాఫ్ శారీ వెనకున్న కథను నిశితంగా వివరించింది. కాగా ఈ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

కథ.. మీ పాత్ర గురించి చెప్పండి!?

‘రణరంగం’ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెంట్ ఇలా ప్లే చాలా ఆసక్తికరంగా కథ సాగుతుంది. శర్వానంద్ క్యారెక్టర్.. సినిమాలో ఆయన ‘గ్యాంగ్ స్టర్’.. ‘రణరంగం’ కథంతా ఆయన చుట్టే తిరుగుతుంది. నిజంగా శర్వా యాక్టింగ్ సూపర్. రెండు షేడ్స్‌ను ఆయన బాగా పలికించారు. శర్వాతో కలిసి నటించడం ఎంతో ఎంజాయ్‌గా ఉంది. సినిమాలోని కొన్ని సీన్స్ భిన్నమైన భావోద్వేగాలు హైలెట్‌గా నిలుస్తాయి. ఈ సినిమాలో నా రోల్ నేచురల్‌గా ఉంటుంది. పైగా నా రోల్ నాకు చాలా బాగా నచ్చింది.. ఖచ్చితంగా నా కెరీర్‌లోనే నేను చేసిన ఈ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే లవ్ స్టోరీ కూడా అంతే అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది.

డైరెక్టర్ గురించి.. హాఫ్ శారీ వెనుక కథేంటి!

డైరెక్టర్ సుధీర్ దగ్గర్నుంచి నేను చాలా నేర్చుకున్నా. స్క్రిప్ట్ మీద ఆయనకు ఫుల్ కమాండ్ ఉంది. ఫస్ట్ ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు కథ నచ్చి ఓకే చెప్పేశాను. నా రోల్ కూడా సినిమాలో వెరీ ఇంట్రస్టింగ్ ఉంటుంది. సినిమాలో నా క్యారెక్టర్ ప్రకారమే నా గెటప్ ఉంది. 1990లోని కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన కథే ఈ ‘రణరంగం’. అందుకు తగ్గట్టుగానే నా పాత్ర కూడా 1990 కాలంలోనే వస్తోంది. అప్పటి సమాజానికి తగ్గట్లుగానే నా పాత్ర తాలూకు గెటప్ ఉంటుంది. ఇక హాఫ్ శారీ విషయంలో మా ‘డాడీ’ కూడా నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అవి కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి.