టాటా బైబై చెప్పేసి కల్యాణి
Send us your feedback to audioarticles@vaarta.com
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు షేడ్స్‌లో నటిస్తున్నాడు. ఒకటి 1980-90 కాలానికి చెందిన పాత్ర కాగా.. మరో పాత్ర నేటి కాలానికి చెందిన గ్యాంగ్ స్టర్ పాత్ర. ఇందులో నేటి కాలానికి తగ్గ గ్యాంగ్‌స్టర్ తో ప్రేమలో పడే డాక్టర్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటించబోతుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తుంది.
ఈమె 1980-90 కాలానికి చెందిన శర్వానంద్ జోడిగా కనపడుతుంది. అయితే ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణను కల్యాణి ప్రియదర్శన్ పూర్తి చేసేసుకుంది. ``శర్వానంద్‌కు థాంక్స్. సెట్స్‌లో చాలా ఫన్‌తో గడిచింది. అలాగే ఈ చిత్రంలో తుపాకితో ఎలా కాల్చాలో నేర్పించిన దర్శకుడు సుధీర్ వర్మకు థాంక్స్. త్వరలోనే అందరినీ తెరపై కలుసుకోవాలని ఆసక్తితో ఉన్నాను`` అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది కల్యాణి ప్రియదర్శన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com