కళ్యాణ వైభోగమే రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
అలా...మొదలైంది, జబర్ధస్త్ చిత్రాల తర్వాత నందినీ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం కళ్యాణ వైభోగమే. నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన కళ్యాణ వైభోగమే చిత్రాన్ని రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మించారు. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన కళ్యాణ వైభోగమే ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే ఇటీవల రిలీజైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్రయూనిట్ సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం కళ్యాణ వైభోగమే సినిమాని ఈనెల 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...పెళ్లి కాని నందినీ రెడ్డి పెళ్లి గురించి కళ్యాణ వైభోగమే సినిమాలో ఏం చెబుతుంది..? అలాగే జబర్ధస్త్ సినిమాతో మిస్ అయిన సక్సెస్ కళ్యాణ వైభోగమే తో సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈనెల 22 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com