పోస్ట్ ప్రొడక్షన్ లో 'కళ్యాణ వైభోగమే'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ". నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది .
ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం " కళ్యాణ వైభోగమే ". షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఉంది . చిత్ర నిర్మాతలు త్వరలో ఆడియో, డిసెంబర్ లో సినిమా ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు.
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , పెర్ల్ మానె , రాశి ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ : జి . వి . ఎస్ . రాజు, ఎడిటర్ : జునైద్ సిద్దిక్ , కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని, యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి , డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్, కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి, ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్, స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com