'కళ్యాణ వైభోగమే' సెన్సార్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం "కళ్యాణ వైభోగమే". నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది .
ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం కళ్యాణ వైభోగమే`. నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సినిమా జనవరి 22న విడుదల కావడం దాదాపు ఖాయమైనట్టే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments