హీరో రామ్ చేతుల మీదుగా కళ్యాణ వైభోగమే ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,January 02 2016]

నాగ‌శౌర్య‌, మాళ‌విక నాయ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మే. ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి తెర‌కెక్కించారు. రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ పై దామోద‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క‌ళ్యాణ్ కోడూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న క‌ళ్యాణ వైభోగ‌మే ఆడియో వేడుక సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హీరో రామ్ ముఖ్య అతిధిగా హాజ‌రై క‌ళ్యాణ్ వైభోగ‌మే ఆడియో సిడిని ఆవిష్క‌రించి తొలి సిడిని యువ హీరోలు రాజ్ త‌రుణ్, సుమంత్ అశ్విన్ కి అంద‌చేసారు.

నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌద‌రి మాట్లాడుతూ...రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ పై దామోద‌ర్ ప్ర‌సాద్ అలా..మొద‌లైంది త‌ర్వాత‌ మ‌ళ్లీ నందిని రెడ్డితో క‌ళ్యాణ వైభోగ‌మే సినిమా చేసారు. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత‌ ఆడియో ఫంక్ష‌న్ కి వ‌చ్చిన‌ట్టు లేదు. పెళ్లికి వ‌చ్చిన‌ట్టు ఉంది. ద‌స‌ప‌ల్లా లో చేసిన సినిమాలు మంచి స‌క్సెస్ అయ్యాయి. ఈ సినిమా కూడా స‌క్సెస్ అవుతుంది.నేను నిర్మించిన‌ ఆంథ్రుడు, అధినాయ‌కుడు సినిమాల‌కు క‌ళ్యాణ్ మాలిక్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా సంగీతానికి క‌ళ్యాణ్ మాలిక్ కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

స్ర‌వంతి ర‌వి కిషోర్ మాట్లాడుతూ...దామోద‌ర్ ప్ర‌సాద్ సినిమాని ఎంత ఇష్ట‌ప‌డి తీస్తారో నాకు బాగా తెలుసు. ఈ సినిమా మంచి స‌క్సెస్ అవ్వాలి అన్నారు.

జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ...ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లేడీ డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి అలా..మొద‌లైంది అనే మంచి సినిమాని అందించారు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.నాగ‌శౌర్య‌తో నందినీ రెడ్డి తెర‌కెక్కించిన క‌ళ్యాణ వైభోగ‌మే కూడా మంచి విజ‌యం సాధించాలి. దామోద‌ర్ ప్ర‌సాద్ గారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. చాలా రోజుల త‌ర్వాత రాశీ, ఐశ్వ‌ర్య న‌టించ‌డం హ్యాపీగా ఉంది అన్నారు.

పోకూరి బాబురావు మాట్లాడుతూ...దామోద‌ర్ ప్ర‌సాద్ డిసెంబ‌ర్ 31 న క‌ళ్యాణ్ వైభోగ‌మే ఆడియో క్యాసెట్ పంపించారు.పాట‌లు వింటుంటే శ‌త‌మానం భ‌వ‌తి అని పాట స్టార్ట్ అయ్యింది. అలాగే తెలుగు వారి అంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన స‌న్నాయి స్వ‌రం వినిపించింది.ఇక పాట‌లు విష‌యానికి వ‌స్తే.... లిరిక్స్ అన్ని అర్ధం అవుతున్నాయి. చాలా కాలం త‌ర్వాత అర్ధ‌మ‌య్యేలా మంచి పాట‌లు అందించిన ల‌క్ష్మీ భూఫాల్ కి స్పెష‌ల్ ధ్యాంక్స్ చెబుతున్నాను. క‌ళ్యాణ్ కోడూరి పాట‌లు అన్ని బాగుంటాయి. క‌ళ్యాణ్ కోడూరి ఫ్యామిలీ ఇండ‌స్ట్రీకి దొరికిన వ‌రం. ఈ ఆడియోలో మేఘ‌మా అనే పాట నాకు చాలా బాగా న‌చ్చింది. ఆడియో, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అన్నారు.

డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ...అలా...మొద‌లైంది టీమ్ చేస్తున్న క‌ళ్యాణ్ వైభోగ‌మే మంచి హిట్ అవ్వాలి అన్నారు.

డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న్ క్రిష్ణ మాట్లాడుతూ ...రంజిత్ మూవీస్ దాము గారంటే నాకు చాలా గౌర‌వం. నాతో ఆయ‌న అంత‌కు ముందు ఆత‌ర్వాత అనే మంచి సినిమాని తీయించారు. ఈ రోజుల్లో...క‌ళ్యాణ్ వైభోగ‌మే అనే టైటిల్స్ పెట్ట‌డం అరుదు. అలాంటిది ఈ టైటిల్ పెట్టారంటే వాళ్ల టేస్ట్ ఏమిటో తెలుస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో & డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ...నాగ‌శౌర్య‌ నా ఫ‌స్ట్ సినిమా హీరో. నా సెకండ్ మూవీలో కూడా నాగ‌శౌర్య‌నే హీరో. అలాగే ఫ‌స్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ మాలిక్ అందించిన ఈ సినిమా ఆడియో, సినిమా మంచి హిట్ అవ్వాలి అన్నారు.

హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ...నందినీ గారు నాకు చాలా ఇష్ట‌మైన వ్య‌క్తి. దాము గారికి సినిమాలంటే చాలా ఫ్యాష‌న్. వీరిద్ద‌రి క‌ల‌సి చేసిన ఈ సినిమా హిట్ అవ్వాలి. సాంగ్స్ బాగున్నాయి. సినిమా కూడా ఖ‌చ్చితంగా బాగుంటుంది అన్నారు.

రాశీ మాట్లాడుతూ... నేను సినిమాలు చేయ‌న‌ని ఎప్పుడూ స్టేట్ మెంట్ ఇవ్వ‌లేదు. అలా స్టేట్ మెంట్స్ ఇచ్చి త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నానని చెప్పి న‌టించ‌డం ఇష్టం ఉండ‌దు. అందుక‌ని కావాల‌నే బ్రేక్ తీసుకున్నాను. ఇప్ప‌డు డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి గారి ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాను. దాము గారి సినిమాకి డ‌బ్బింగ్ చెప్పాను కానీ ఎప్పుడూ చూడ‌లేదు. అలాంటిది ఇప్పుడు ఆయ‌న నిర్మించిన సినిమాలో న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను క‌ళ్యాణ వైభోగ‌మే మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ...క‌ళ్యాణ్ కోడూరి సంగీతం చాలా బాగుంటుంది. అలాగే దాము గారు మంచి సినిమాల‌ను అందిస్తుంటారు. నందినీ రెడ్డి అలా...మొద‌లైంది సినిమా చాలా ఇష్టం. నాగ శౌర్య చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ టు క‌ళ్యాణ వైభోగ‌మే టీమ్ అన్నారు.

హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ మాట్లాడుతూ...ఈ సినిమాలో న‌టించ‌డం నేను తీసుకున్న నిర్ణ‌యం. మంచి సినిమాలో న‌టించేందుకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ...దాము గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత‌. స్ర్కిప్ట్ ను న‌మ్మి తీసే త‌క్కువ మంది నిర్మాత‌ల్లో దాము గారు ఒక‌రు. నాగ శౌర్య ఊహ‌లు గుస గుస లాడే చూసాను. ఫ‌స్ట్ మూవీకే చాలా బాగా న‌టించాడు. క‌ళ్యాణ్ మాలిక్ చాలా మంచి సంగీతాన్ని అందిస్తారు. ఆయ‌న రి రీకార్డింగ్ కూడా చాలా అద్భుతంగా అందిస్తారు. ఈ సినిమా విజ‌యం సాథించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ...నా ప్ర‌తి సినిమాలో ఎవ‌రో ఒక‌ర్ని ప‌రిచ‌యం చేస్తుంటాను. ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫ‌ర్ రాజు ను ప‌రిచయం చేసాను. చాలా మంచి అవుట్ పుట్ అందించాడు. నాకు ఎంత‌గానో స‌పోర్ట్ అందించిన ఫ్రెండ్ ధ‌ర్మ‌తేజ్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. రాశీ, ఐశ్వ‌ర్య ల‌ను ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ చేస్తున్నాం అన్నారు.

ర‌చ‌యిత ల‌క్మీ భూపాల్ మాట్లాడుతూ...అలా...మొద‌లైంది త‌ర్వాత మ‌ళ్లీ ఈ టీమ్ తో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. ఫ‌స్ట్ టైం సినిమాలో మొత్తం అన్ని పాటలు రాశాను. అలాగే మాట‌లు కూడా రాసాను. అలా...మొద‌లైంది క‌న్నా ఎక్కువగా ఈ సినిమా 100% స‌క్సెస్ అవుతుంది అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌ళ్యాన్ మాలిక్ మాట్లాడుతూ...ఈ బ్యాన‌ర్ లో నాకు నాలుగ‌వ సినిమా ఇది. అలా...మొద‌లైంది త‌ర్వాత మ‌ళ్లీ నందినీ రెడ్డి సినిమాకి సంగీతం అందించాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌న డ్రీమ్ ఈ సినిమాతో నెర‌వేరుతుంది అన్నారు.

డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ...ల‌క్ష్మీ భూపాల్ చాలా మంచి పాట‌లు, మాట‌లు అందించారు. క‌ళ్యాణ్ మాలిక్..అద్భుత‌మైన ఆడియో అందించారు. దాము గారికి క‌థ చెప్పిన‌ప్పుడు ఆయ‌న‌కు అర్ధం అయిపోతుంటుంది. సినిమాటోగ్రాఫ‌ర్ రాజు చాలా మంచి అవుట్ పుట్ అందించారు. అంద‌రూ న‌మ్మి చేసిన ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని నా న‌మ్మ‌కం. నాగ శౌర్య‌, మాల‌విక నాయ‌ర్ వ‌య‌సులో చిన్న‌వాళ్లు అయినా ఈ సినిమాలో అద్భుతంగా న‌టించారు అన్నారు.

More News

బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ పై క్రిష్ణ స్పంద‌న‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

మహేష్ టీజర్ కాపీనా..?

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కిల్లింగ్ వీర‌ప్ప‌న్ న్యూ రిలీజ్ డేట్..

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం కిల్లింగ్ వీర‌ప్ప‌న్. గంథ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన విష‌యం తెలిసిందే.

విడుదలకు రెడీ అవుతోన్న 'తుంటరి'

కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెం.2లో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తుంటరి'.బాణం,సోలో, సారొచ్చారు,ప్రతినిధి,రౌడీఫెలో వంటి సినిమాలతో తనదైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్.

'కథకళి' రిలీజ్ డేట్...

పందెంకోడి,పొగరు,భరణి,ఇంద్రుడు,పూజ,జయసూర్య వంటి మాస్ కమర్షియల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన మాస్ హీరో విశాల్