3 భాగాలుగా కళ్యాణ్ రామ్ 'బింబిసారా'.. ఎన్టీఆర్ హెల్ప్?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'బింబిసారా' ఆయన కెరీర్ లోనే సాహసోపేతమైన చిత్రం అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. అందుకే ఈ నందమూరి హీరో రిస్క్ చేస్తున్నాడు.
ఇదీ చదవండి: 'వకీల్ సాబ్' బ్యూటీ బ్లాస్టింగ్ సెక్సీ లుక్స్
మల్లిడి వశిస్ట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టైం ట్రావెల్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కళ్యాణ్ రామ్ వారియర్ కింగ్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా అందుతున్న సమాచారం అంచనాలు పెంచే విధంగా ఉంది.
కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మగధరాజ్యం చరిత్రని చెప్పాలంటే మూడు భాగాలు అవసరం అని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే తొలి భాగం షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. తొలి భాగానికి 40 కోట్ల బడ్జెట్ ఖర్చయినట్లు తెలుస్తోంది.
మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వాయిస్ ఓవర్ తో ప్రారంభిస్తే బావుంటుంది. అందుకోసం ఎన్టీఆర్ హెల్ప్ తీసుకోబుతున్నట్లు టాక్. తన అన్న చిత్రానికి వాయిస్ ఓవర్ అందించేందుకు ఎన్టీఆర్ ముందుకురాబోతున్నట్లు వినికిడి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments