ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌ల్యాణ్ రామ్‌

  • IndiaGlitz, [Monday,April 01 2019]

రీసెంట్‌గా విడుద‌లైన '118'తో స‌క్సెస్ అందుకున్నాడు హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. మ‌ల్లిడి వ‌శిష్ట్ చెప్పిన కథ న‌చ్చ‌డంతో త‌న స్వంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు క‌ల్యాణ్ రామ్‌. సోషియో ఫాంట‌సీ జోన‌ర్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ముందు ఈ సినిమాకు తుగ్ల‌క్ అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ ఇప్పుడు 'అశ్వ‌థామ' అనే టైటిల్‌ను పెట్టబోతున్నార‌ట‌.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల్ రెడీ స్టార్ట్ అయ్యాయ‌ట‌. అందులో భాగంగా ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్‌ను న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం వారిద్ద‌రితో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వివ‌రాల ప్ర‌కారం అందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక హీరోయిన్ కాగా.. మ‌రో హీరోయిన్‌గా క్యాథ‌రిన్ ట్రెసా న‌టించ‌నుంద‌ట‌. త్వ‌ర‌లోనే హీరోయిన్స్ విష‌యంలో ఓ క్లారిటీ రానుంది.

More News

జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసిపోయింది!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లొస్తాయ్.. అన్ని సీట్లొస్తాయ్ అని జాతీయ మీడియా మొదలుకుని ప్రాంతీయ మీడియా సంస్థలు ముఖ్యంగా పలువురు జ్యోతిష్యులు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఆర్జీవీ అంత తొందరెందుకు.. ఆగ్రహించిన సుప్రీం!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్‌‌కు హైకోర్టు స్టే ఇవ్వడంతో అత్యవసర విచారణకు నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

చైతు, సమంత కెరీర్ లోనే 'మజిలీ' ది బెస్ట్ : ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున, వెంకటేష్

' మజిలీ ' ట్రైలర్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. చైతు, సమంత కెరీర్ లోనే 'మజిలీ' ది బెస్ట్ సినిమా అవుతుంది - మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో అక్కినేని నాగార్జున, వెంకటేష్.. ఏప్రిల్ 5 న

వైసీపీ కండువా కప్పుకున్న ప్రముఖ యాంకర్..

ఏపీలో సరిగ్గా మరో పదిరోజుల్లో ఎన్నికలు జరగనుండగా వైసీపీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. అటు రాజకీయ నేతలు.. ఇటు సెలబ్రిటీలకు కండువాలు కప్పే పనిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్

బాలయ్యపై విజయసాయిరెడ్డి వివాదాస్పద ట్వీట్!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.