ఇద్దరు హీరోయిన్స్‌తో కల్యాణ్ రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా విడుదలైన `118`తో సక్సెస్ అందుకున్నాడు హీరో నందమూరి కల్యాణ్ రామ్. ఇప్పుడు మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మల్లిడి వశిష్ట్ చెప్పిన కథ నచ్చడంతో తన స్వంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు కల్యాణ్ రామ్. సోషియో ఫాంటసీ జోనర్లో ఈ సినిమా రూపొందనుంది. ముందు ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ ఇప్పుడు `అశ్వథామ` అనే టైటిల్‌ను పెట్టబోతున్నారట.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ స్టార్ట్ అయ్యాయట. అందులో భాగంగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వారిద్దరితో చర్చలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒక హీరోయిన్ కాగా.. మరో హీరోయిన్గా క్యాథరిన్ ట్రెసా నటించనుందట. త్వరలోనే హీరోయిన్స్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com