కల్యాణ్ రామ్ కి కూడా కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
`ఇజం` తరువాత చిన్న విరామం తీసుకుని.. సోదరుడు ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ చిత్రాన్ని నిర్మించారు కథానాయకుడు కల్యాణ్ రామ్. ఆ తరువాత.. రెండు చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తూ బిజీగా మారిపోయారు. ఆ రెండు చిత్రాలే `ఎం.ఎల్.ఎ`(మంచి లక్షణాలున్న అబ్బాయ్), `నా నువ్వే`. వీటిలో `ఎం.ఎల్.ఎ `ముందుగా విడుదల కానుంది. ఉపేంద్ర మాధవ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని మార్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారమ్. అదే గనుక జరిగితే.. బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ కి కలిసొచ్చిన ఆ తేది కల్యాణ్ రామ్ కి కూడా కలిసొస్తుందేమో చూడాలి. కాస్త వివరాల్లోకి వెళితే.. తారక్‌కి తొలి సూపర్ హిట్‌ని అందించిన `ఆది` 2002లో ఇదే మార్చి 28న విడుదలైంది. ఇక సింహా తరువాత సరైన విజయం లేని బాలయ్యకి 2014లో ఇదే మార్చి 28న రిలీజైన `లెజెండ్` మంచి విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో `పటాస్` తరువాత సరైన విజయం లేని కల్యాణ్ రామ్‌కి కూడా మార్చి 28 కలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments