అప్పుడు బాలకృష్ణ...ఇప్పుడు కళ్యాణ్ రామ్Â
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణతో పదేళ్ల క్రితం ఓ భారీ సినిమా తీసి హిట్ కొట్టలేకపోయిన ఓ దర్శకుడు.. మళ్లీ పదేళ్ల తరువాత నందమూరి కళ్యాణ్‌రామ్‌తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. 'పిల్లా నువ్వు లేని జీవితం'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. ప్రస్తుతం గోపీచంద్‌తో 'సౌఖ్యం' సినిమా తీస్తున్న ఈ దర్శకుడు.. ఆ చిత్రం అనంతరం కళ్యాణ్‌రామ్‌తో సినిమా చేయబోతున్నాడని కథనాలు వినిపిస్తున్నాయి.
విశేషం ఏమిటంటే.. గోపీచంద్‌తో 'యజ్ఞం' వంటి హిట్ చిత్రం తీసిన తరువాతనే బాలకృష్ణతో 'వీరభద్ర' చేసే అవకాశం వచ్చింది రవికుమార్ చౌదరికి. ఇప్పుడు మళ్లీ గోపీచంద్‌తో 'సౌఖ్యం' తీసిన తరువాతనే కళ్యాణ్‌రామ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. మొత్తమ్మీద.. మొదట గోపీచంద్ సినిమా, తరువాత నందమూరి హీరో సినిమా.. ఇలా మంచి ట్యూనింగే కుదురుతోంది ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments