కల్యాణ్ రామ్ తనయుడి సినీ రంగ ప్రవేశం...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో, నిర్మాత అయిన కల్యాణ్ రాం ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఢిల్లీ కి చెందిన మోడల్ అదితి ఆర్య నటిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ చిన్ననాటి పాత్ర కోసం చాలా మంది చిన్న కుర్రాళ్లను ఫోటో షూట్ చేశారట. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ తనయుడు శౌర్యతో ఈ పాత్రను చేయించాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఫోటో షూట్ కూడా చేస్తారని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com