క‌ల్యాణ్‌రామ్ ఇంకో సినిమా

  • IndiaGlitz, [Friday,April 05 2019]

క‌ల్యాణ్‌రామ్ ఇప్పుడు మాంచి స్పీడు మీదున్నారు. వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్ప‌టికే ఆయ‌న న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడులో త‌న తండ్రి హ‌రికృష్ణ పాత్ర‌ను పోషించారు క‌ల్యాణ్‌రామ్‌. బ‌యోపిక్‌లో న‌టించ‌డ‌మే కాకుండా, కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 118లోనూ న‌టించారు.

ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈయ‌న సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నారు. వేణుమ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు తుగ్ల‌క్ అనే పేరు అనుకుంటున్నారు. ఈ చిత్రం త‌ర్వాత చేయబోయే సినిమాకు సంబంధించి క‌థ‌ను కూడా క‌ల్యాణ్‌రామ్ అంగీక‌రించార‌ట‌.

ఆ సినిమాకు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. విరించి వ‌ర్మ ఇంత‌కు ముందు ఉయ్యాల జంపాల‌, మ‌జ్ను సినిమాలు తెర‌కెక్కించారు. తాజాగా క‌ల్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కించ‌బోయే సినిమాను కూడా ఆయ‌న ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం.