కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' ఎప్పుడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం 'నా నువ్వే'. ఇంతకుముందు సిద్ధార్థ్, నిత్యా మీనన్, ప్రియా ఆనంద్ కాంబినేషన్లో '180' వంటి ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించిన జయేంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
ఇటీవల విడుదల చేసిన ఈ మ్యాజికల్ లవ్ స్టొరీ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రచార చిత్రాలను బట్టి చూస్తే.. ఇందులో కళ్యాణ్ రామ్‌ను లవర్ బాయ్‌గా ఒక డిఫరెంట్ లుక్‌తో దర్శకుడు తెరపైన చూపించనున్నారన్నది స్పష్టమవుతోంది.
'గీతాంజలి', 'ఖుషి', 'ఇష్క్' వంటి జనరంజక ప్రేమకథా చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకి కూడా పనిచేస్తుండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కూల్ బ్రీజ్ సినిమాస్ అండ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను వేసవి కానుకగా మే 18న విడుదల చేయనున్నారు.
మరి.. సీరియస్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించిన కళ్యాణ్ రామ్.. లవర్ బాయ్‌గానూ మెప్పిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com