కళ్యాణ్ రామ్ మూవీ అప్ డేట్...
Monday, May 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెల 25నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపుకోనుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ ని సరికొత్తగా చూపించేలా ఈ చిత్ర కథను తయారు చేసారు పూరి. ఈ నెల 25 నుంచి హైదరాబాద్ లో ఓ వారం రోజులు షూటింగ్ చేయనున్నారు. ఆతర్వాత జూన్ మొదటివారంలో స్పెయిన్ లో దాదాపు నెలరోజులు పాటు షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments