కళ్యాణ్ రామ్ మూవీ అప్ డేట్...

  • IndiaGlitz, [Monday,May 09 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రం ఈ నెల 25నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌పుకోనుంది. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు.
క‌ళ్యాణ్ రామ్ ని స‌రికొత్త‌గా చూపించేలా ఈ చిత్ర క‌థ‌ను త‌యారు చేసారు పూరి. ఈ నెల 25 నుంచి హైద‌రాబాద్ లో ఓ వారం రోజులు షూటింగ్ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత జూన్ మొద‌టివారంలో స్పెయిన్ లో దాదాపు నెల‌రోజులు పాటు షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న క‌ళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

More News

అమ్మకు గుడి కట్టిస్తున్న దర్శకుడు..

అమ్మకు గుడి కట్టిస్తున్న దర్శకుడు..ఎవరో కాదు రాఘవ లారెన్స్.అవును..లారెన్స్ తన అమ్మకు గుడి కట్టిస్తున్నారు.

మహేష్, సమంత.. సీజన్ మారుతోంది

మహేష్ బాబు,సమంత..ఈ ఇద్దరిదీ సూపర్ జోడీ.రెండు సార్లు ఘనవిజయాలను సొంతం చేసుకున్న ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి 'బ్రహ్మోత్సవం'తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

సురేంద‌ర్ రెడ్డి ఈ సారైనా అధిగమిస్తాడా?

రామ్ చ‌ర‌ణ్‌, సురేంద‌ర్ రెడ్డి.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఆస‌క్తిక‌రంగా ఉన్న కాంబినేష‌న్‌లో ఇదొక‌టి. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన 'త‌ని ఒరువ‌న్' రీమేక్ కోసం ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నారు. క‌థానాయకుడిగా చ‌ర‌ణ్ కి మంచి ట్రాక్ రికార్డు ఉన్న‌ట్టే.

నానితోనైనా బ్రేక్ చేస్తాడా?

క్లాసిక్ చిత్రాల  టైటిల్స్ ని మ‌రోసారి వాడుకోవ‌డం సాధార‌ణ‌మైపోయిన రోజులివి. సినిమా బాగుంటే స‌రి, లేదంటే అప్ర‌తిష్ట పాల‌వ్వాల్సిందే అన్న‌ట్లుగా ఉంటుంది ఇలాంటి టైటిల్స్ పెట్టుకుంటే.

గ‌తేడాది సూర్య‌.. ఈ ఏడాది మ‌హేష్‌..

అందం ఉంది.. అభిన‌యం ఉంది.. అవ‌కాశాలూ ఉన్నాయి.. అయినా అంద‌ల‌మెక్క‌లేని ప‌రిస్థితి క‌న్న‌డ క‌స్తూరి ప్ర‌ణీత‌ది. చిన్న సినిమాతో తొలి అడుగులు వేసి.. పెద్ద హీరోల ప‌క్క‌న సెకండ్ లీడ్ చేసే స్థాయికి ఎదిగినా ఈ ముద్దుగుమ్మ‌కి ఆశించిన స్థాయి గుర్తింపు రావ‌డం లేద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.