షేర్ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఇదే...
- IndiaGlitz, [Sunday,October 04 2015]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మల్లిఖార్జున్ దర్శకత్వం వహించారు. కొమర వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 10న షేర్ ఆడియోను, ఈనెల 30న సినిమాను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే...షేర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించే సినిమా ఫిక్స్ అయ్యిందట. డైరెక్టర్ వీరు పోట్ల... కళ్యాణ్ రామ్ కోసం కథ రెడీ చేసాడట. కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు యాక్షన్ ఉంటూనే...ఎంటర్ టైన్మెంట్ కూడా ఉంటుందట. వీరు పోట్ల చెప్పిన ఈ డిఫరెంట్ స్టోరి కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్టోరీ డిష్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించనున్నట్టు సమాచారం.