కల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. కె.వి.గుహన్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నందమూరి రామకృష్ణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
కె.వి.గుహన్ మాట్లాడుతూ - ``కల్యాణ్ హీరోగా మహేశ్ కోనేరుగారి నిర్మాణంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది`` అన్నారు.
నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ - ``కల్యాణ్ రామ్‌గారితో మా బ్యానర్‌లో `నా నువ్వే` సినిమా చేశాం. అది త్వరలోనే విడుదల కానుంది. ఆ సినిమా విడుదలయ్యే లోపు కల్యాణ్‌రామ్‌గారితోనే రెండో సినిమాను నిర్మించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. గుహన్‌గారు చెప్పిన స్క్రిప్ట్ మాకు నచ్చింది. అలాగే కల్యాణ్‌రామ్‌గారికి కూడా నచ్చడంతో సినిమా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. మే 2 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు శేఖర్ చంద్రగారు చాలా మంచి సంగీతాన్ని అందిస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మా సినిమాకు సంగీతం అందించనుండటం హ్యాపీగా ఉంది`` అన్నారు.
షాలిని పాండే మాట్లాడుతూ ``తెలుగులో నా రెండో సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్. సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది`` అన్నారు.
నివేదా థామస్ మాట్లాడుతూ - ``గుహన్ గారు స్క్రిప్ట్‌ను తమిళంలో వినిపించారు. తెలుగు సినిమాలకు ఆరు నెలలు దూరంగా ఉన్నాను. నిర్మాత మహేశ్‌గారితో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.
శేఖర్ చంద్ర మాట్లాడుతూ - ``సస్పెన్స్ థ్రిల్లర్... మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉన్న సినిమా`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com