కాజల్‌తో పాట పాడుకుంటున్న కళ్యాణ్ రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'ఎం.ఎల్.ఎ.' మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, కాజల్ పై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అజెర్ బైజన్ రాజధాని అయిన బాకులో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.
ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అందమైన లొకేషన్లలో ఈ పాటను షూట్ చేస్తున్నారని.. ఈ పాట తెరపై విజువల్స్ పరంగా మరింతగా ఆకట్టుకుంటుందని చిత్రవర్గాలు వెల్లడిస్తున్నాయి. మణిశర్మ స్వరపరచిన ఈ పాటకు డాన్స్ మాస్టర్ జానీ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా స్కోప్ ఉన్న ఈ సబ్జెక్ట్‌ను.. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ చాలా అనుభవమున్న దర్శకుడిలా తెరకెక్కించారని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుంటే.. ఈ సినిమాతో పాటు నా నువ్వే`లో కూడా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మే 25న ఈ చిత్రం విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com